మందమర్రి (విజయక్రాంతి): మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని మందమర్రి గ్రామానికి చెందిన నిరుపేదలకు శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సదానందం హాజరై మాట్లాడారు. నిరుపేదలకు సేవ చేయడం అభినందనీయమని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగించాలని మా ఊరు సేవా సంఘం సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం, అధ్యక్షులు పెద్ది రాజన్న, డా. శంకర్, కోట రాజన్న, పాలమాకుల బీమ్ సేన్, ఎండీ ముజాహిద్ లు పాల్గొన్నారు.