13-03-2025 01:52:48 AM
నిర్మల్ మార్చి 12 (విజయక్రాంతి) ః జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలతో పాటు భవిష్య కేంద్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఉపకరణాలను పంపిణీ చేశారు.
పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో విద్యాశాఖ గుర్తించిన 91 మంది విద్యార్థులకు అవసరమయ్యే ఉపకారణాలను అందించి విద్యలో వారు మంచి ఫలితాలు తేవాలని సూచించారు. వినికిడి యంత్రాలు స్టిక్కర్స్ కండ్లజోళ్ళు ఇతర పరికరాలు అందించి వారిని అన్ని విధాల ప్రోత్సహించడం జరుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఎం ఈ ఓ నాగేశ్వరరావు అధికారులు నరసయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.