calender_icon.png 28 February, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారికి స్లిప్పుల అందజేత

27-02-2025 09:53:53 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ నాయకులు గురువారం మద్నూర్ మండల కేంద్రంలో ప్రయత్నించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఓటర్ స్లిప్పులను రాసి ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం సహకరించాలని కోరారు. మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో బీజేపీ నాయకులు అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను వేడుకుంటూ ..ఓట్లు వేసి బీజేపీ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణా తార సందర్శించి పోలింగ్ వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం పోలింగ్ సమయం ముగిసే వరకు బీజేపీ నాయకులు మద్నూర్ పాత బస్టాండ్ వద్ద కూర్చొని ఓటు వేసేందుకు వచ్చే వారికి సీరియల్ నెంబర్ స్లిప్పులను అందజేశారు. అధ్యక్షులు తుకారం సీనియర్ నాయకులు పండిత్ రావ్ జూబ్రే సుధాకర్ సంతోష్ కృష్ణపటేల్ బిజెపి నాయకులు  మండలనాయకులు పాల్గొన్నారు.