calender_icon.png 7 October, 2024 | 1:51 PM

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ

07-10-2024 11:03:49 AM

హైదరాబాద్: ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కును  సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీథర్ బాబు పాల్గొన్నారు. 2023-24 సంవత్సరానికి సింగరేణికి రూ. 2,412 కోట్ల లాభం వచ్చింది. లాభాల్లో 33 శాతం రూ. 796 కోట్లను ప్రభుత్వం కార్మికులకు బోనస్ ప్రకటించింది. దీంతో ఒక్కో కార్మికుడికి సగటున రూ. 1.9 లక్షలు బోనస్ అందనుంది. గతంలో పోల్చుకుంటే ఈ సారి సగటున రూ. 20 వేల బోనస్ అధికంగా అందుకుంటున్నారు కార్మికులు. సింగరేణి చరిత్రలోనే ఈ సారి అత్యధికంగా ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. 1998-99 నుంచి సింగరేణి లాభాల్లో వాటా పంచే ఆనవాయితీ వస్తోంది. గతేడాది రూ. 1,227 కోట్ల లాభంలో 30 శాతం బోనస్ ప్రకటించింది. ఈ సారి సింగరేణి ఒప్పంద కార్మికులకు ప్రభుత్వం రూ. 5 వేల బోనస్ ప్రకటించింది.