calender_icon.png 5 December, 2024 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు నేడు డబుల్ బెడ్రూం పట్టాల పంపిణీ

05-12-2024 12:36:55 AM

అందజేయనున్న మంత్రులు పొన్నం, పొంగులేటి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4(విజయక్రాంతి): జూబ్లీహిల్స్, ముషీరాబాద్‌కు చెందిన లబ్ధిదారులకు గురువారం డబుల్ బెడ్రూం పట్టాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్లు డీఆర్వో ఈ వెంకటాచారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముషీరాబాద్ బాకారానికి చెం దిన 44 మంది, జూబ్లీహిల్స్ కమలానగర్‌కు చెందిన 44మంది లబ్ధిదా రులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.