calender_icon.png 3 October, 2024 | 4:37 PM

మహిళలే కుటుంబ పెద్దగా డిజిటల్ కార్డుల పంపిణీ

03-10-2024 01:24:44 PM

హైదరాబాద్: ఫ్యామిలీ కార్డు ఉంటే చాలు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో 30 శాఖలకు సంబంధించిన సమాచారం ఉంటుందన్నారు. మహిళలే కుటుంబ పెద్దగా డిజిటల్ కార్డు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు, తప్పులు చేసిందన్న సీఎం రేవంత్ ఎలివేటెడ్ కారిడాక్ కు అనుమతులు తెచ్చిందని తానేనని సీఎం స్పష్టం చేశారు. అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్, వరదల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ, 1500 కోట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ. 500 కోట్లు మూసీ పరిధిలోని పేదలకు పంపిణీ చేయండని సీఎం కోరారు.