calender_icon.png 5 February, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ విజయవంతం చేయాలి

05-02-2025 06:00:28 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ, మున్సిపల్, సంక్షేమం, జిల్లా పరిషత్, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ఐ.సి.డి.ఎస్. శాఖల అధికారులు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో 1-19 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని తెలిపారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 1 1,67,000 మంది పిల్లలకు ఈ నెల 10వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలు అందించడం జరుగుతుందని, ఈ రోజున అందని విద్యార్థులకు తిరిగి ఈ నెల 17వ తేదీన అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ విషయంపై జిల్లాలు అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో టామ్-టామ్, దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. 2 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలకు సగం మాత్ర, 2-19 వయసు గల పిల్లలకు ఒక మాత్ర అందించాలని, మాత్రలు వేసే సమయంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.