బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నె పల్లి మండలంలోని కన్నెపల్లి, జనకాపూర్ గ్రామాల్లో మహాలక్ష్మి లబ్ధిదారులకు శనివారం అభయ హస్తం వంట గ్యాస్ మంజూరు పత్రాలను బెల్లంపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరావు నర్సింగరావు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా లబ్ధిదారులకు వంట గ్యాస్ పథకాన్నిఅందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పప్పుల రామాంజనేయులు తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.