calender_icon.png 30 April, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

30-04-2025 01:01:46 AM

మద్నూర్, ఏప్రిల్ 29: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం చిన్న ఎక్లారా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ పటేల్ మాట్లాడుతూ...రాష్ర్టంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు.లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్‌ఎఫ్ పథకం కొండంత అండగాఉంటుందన్నారు.సీఎంఆర్‌ఎఫ్ పథకం చికిత్స పొందిన పేదలకు ఆర్థిక భరోసా అన్నారు.

కార్యక్రమంలో ఎన్‌ఎస్యూఐ మండల అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, కాశీనాథ్, రవి పటేల్, మనోహర్, దేవానంద్, రమేశ్, తదితరులు ఉన్నారు.