11-03-2025 10:31:43 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషితో అర్హులైన లబ్ధిదారులందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, నాయకులు అంబీర్ శ్యాం రావు, బండారు సంజీవులు, చంద్రం, మేకల రాజు తదితరులు పాల్గోన్నారు.