పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
24-05-2026 12:30 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారురాలు బేజుగాం లక్ష్మికి అందజేశారు. రూ.28,500 విలువైన ఈ చెక్కును పంపిణీ చేస్తూ నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేక్ మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు టోనీకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.






