26-04-2025 05:57:13 PM
కరీంనగర్ (విజయక్రాంతి): మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 81 మంది లబ్ధిదారులకు సుమారు 21,73,500 రూపాయల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.