22-04-2025 01:18:25 AM
ఖమ్మం, ఏప్రిల్ 21 ( విజయక్రాంతి ):-ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ళలో అత్యవసర వైద్య చికిత్సలు పొందిన పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన చెక్కులను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల క్యాంపు కార్యాలయంలో 35 మందికి రూ.11.23 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన ప్రజలకు లబ్ధి చేకూరింది.
ఈ కార్యక్రమంలోమద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు హరినాధ బాబు, తిరుమలాయపాలెం కాంగ్రెస్ మండల అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు కన్నెబోయిన సీతారామయ్య, అనంత రెడ్డి, ముస్తఫా, టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, మంకేన వాసు, లింగాల రవి, కాంపాటి వెంకన్న, పాపా నాయక్, కానుగుల రాధాకృష్ణ, డేగల ఉపేందర్, బాణోత్ హరినాథ్, ఊటుకూరి రంజిత్, గడ్డం శ్రీకళా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.