16-04-2025 12:43:25 AM
కూసుమంచి ,ఏప్రిల్ 15 :వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరు అయిన సీఎంఆర్‌ఎ ఫ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృ హ నిర్మాణ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు కూసు మంచి క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు..
76 మంది లబ్ధిదారులకు గాను మంజూరు అయిన 25 లక్షల పదివేల రూ పాయల చెక్కులను ఆయా లబ్ధిదారులకు అందజేశారు.. ఈ సందర్భంగా బీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవారికి అనారో గ్య సమస్యలు వస్తె చికిత్స కోసం అప్పులు చేసి చికిత్స పొందుతున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోల్లంపల్లి సుధాకర్ రెడ్డి , కంచర్ల జీవన్ రెడ్డి ,బారి వీరభద్రం , చాట్ల పరశురాం ,అర్వపల్లి జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.