10-04-2025 12:19:27 AM
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 9(విజయక్రాంతి):కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దుంపటి కిషన్, కాడలి దుర్గాప్రసాద్,ముచర్ల రమాదేవిలకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సీఎం సహాయానిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందాన్నారు. ఈ కార్యక్రమంలో బి.శివకుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సంజీవ్ కుమార్, అరుణ్ కుమార్, మాక్బుల్, మోటే శ్రీనివాస్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.