05-04-2025 08:31:17 PM
కొల్చారం,(విజయక్రాంతి): మండల పరిధిలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ కొల్చారం మండలానికి మంజూరైన 11 మంది లబ్ధిదారులకు 6 లక్షల, 75 వేల విలువ గల చెక్కులను శనివారం లబ్ధిదారులకు అందజేసినట్లు మల్లేశం గౌడ్ తెలిపారు. ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో పలు గ్రామాలలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొంగోడు, యేనగండ్ల, సంగాయపేట, రాంపూర్, ఏటిగడ్డ మాందాపూర్, కొల్చారం, వరిగుంతం, గ్రామాలకు సంబంధించిన చెక్కులను ఆయా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.