27-03-2025 12:16:13 AM
కొల్చారం, మార్చి 26: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని మాజీ సిడిసి చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నాడు మండల పరిధిలోని చిన్నఘనపూర్ గ్రామంలో ఇద్దరు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బాణావత్ మంజుల 11,500, నుహసవాద్ బుజ్జి 33,500 రూపాయలు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడుపాయల మాజీ డైరెక్టర్ బాగా రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ రాజా గౌడ్ సొసైటీ డైరెక్టర్ మల్లేశం టిఆర్‌ఎస్ నాయకులు సందీప్ విట్టల్ రెడ్డి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.