calender_icon.png 29 March, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

22-03-2025 01:21:03 AM

కుత్బుల్లాపూర్, మార్చి 21: మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని మైనంపల్లి నివాసంలో మల్కాజిగిరికి చెందిన రవీందర్కు రూ.20వేలు, గౌతమ్నగర్కు చెందిన భాగ్యలక్ష్మి రూ.60వేలు, ఎస్కే బాషాకు రూ.42 వేలు సీఎంఆర్‌ఎఫ్ మంజూరుకాగా, శుక్రవారం లబ్ధిదారుల కుటుంబసభ్యులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీకాంత్రెడ్డి, రాందాస్ సంతోష్ ముదిరాజ్, వినోద్యాదవ్, రామచందర్, సానాది శంకర్, మోహన్రాజ్, షకీల్, చందు, తదితరులు పాల్గొన్నారు