21-03-2025 12:55:50 AM
కూసుమంచి , మార్చి 20 :-చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్‌ఎఫ్) కు దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను ఆయా లబ్ధిదారులకు గురువారం కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో క్యాంప్ కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు..
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫారసు మేరకు మంజూరైన 25 చెక్కులకు గాను రూ.6.89 లక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వారికి అపన్న హస్తంగా సీఎంఆర్‌ఎఫ్ నిధి ఉపయోగ పడుతుందని, సిఎంఆర్‌ఎఫ్ బాధితులకు భరోసా కలిగిస్తున్నది అని అన్నారు. తమకు సిఎంఆర్‌ఎఫ్ నిధులు రావడానికి సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఏర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, నాయకులు మొహమ్మద్ హఫీజూద్దీన్, మాదాసు ఉపేందర్ రావు, బారి వీరభద్రం, కంచర్ల జీవన్ రెడ్డి, ముల్కురి శ్యామ్ సుందర్ రెడ్డి, మల్సూర్, బిక్షం నాయక్, చాట్ల సత్యనారాయణ, బిష్మ చారి, కణతల నాగయ్య, కొండ శ్రీనివాస్, యూత్ విభాగం బెల్లంకొండ శరత్ గౌడ్, మొహమ్మద్ రఫీ, ధర్మతండా కుమార్, వడిత్య సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.