calender_icon.png 4 February, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

30-01-2025 12:00:00 AM

చేగుంట, జనవరి 29 ః సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల పరిధిలోని నిరుపేదలు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా వారికి చెక్కులు అందించారు.

చేగుంట జంగళ సాయికుమార్ యాదవ్ కు రూ.37,500, అన్నసాగర్ గ్రామానికి చెందిన శంకుతలకు రూ. 60వేలు, చేగుంటకు చెందిన రూబీనా సుల్తాన్ రూ.60వేలు, బత్తుల కుమారయ్యకు రూ.30 వేల చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజ నేయులు గౌడ్, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయి పేట్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుర్మ లక్ష్మి, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి, భూంలింగాగౌడ్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనే యులు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, ఏ ఎం సి మాజీ చైర్మన్ వెంగల్ రావు, మాజీ సర్పం భాస్కర్,అయిత పరంజ్యోతి, నాగేష్ గుప్తా, జగన్ గౌడ్ స్వామి, ఆగమయ్య, బాలిరెడ్డి, రాజా గౌడ్ పాల్గొన్నారు.