హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధ్దిదారులకు డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి ఆదివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్‌తో పాటు ఇతర డివిజన్ల లబ్ధ్దిదారులకు రూ.4 లక్షల విలువ చేసే చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా ఉంటోందన్నారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.