జహీరాబాద్ ఎమ్మెల్యే కొనంటి మాణిక్ రావు
సంగారెడ్డి (విజయ క్రాంతి): పేదలు మెరుగైన వైద్యసేవలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానికిరావు తెలిపారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. 13 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు