03-04-2025 02:56:22 PM
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం లింగంపల్లి గ్రామంలో నీలం రుక్మిణిబాయి కి సిఎం ఆర్ ఎఫ్ చెక్కును, నీలాంగి మీనబాయికి కళ్యాణ లక్ష్మి చెక్కును గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్య క్రమంలో మండల సీనియర్ నాయకులు శ్యామప్పపటేల్, మల్లప్పపటేల్,డాక్టర్ సంజీవ్,పీరాజి కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.