08-04-2025 09:34:13 PM
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
కోదాడ: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి చేతుల మీదుగా 296 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.1.6 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కోదాడ, అనంతగిరి, మునగాల, చిలుకూరు, మోతె, నడిగూడెం మండలాలల లబ్దిదారులకు మంజురైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మార్కెట్ చైర్మన్ తిరపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ బషీర్, ఆర్డీఓ సూర్యనారాయణ, లక్ష్మీనారాయణరెడ్డి, వంగవేటి రామారావు, తహశీల్దార్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.