calender_icon.png 6 April, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

05-04-2025 07:23:57 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పంపిణీ చేశారు.

లబ్ధిదారులు కతూరీ రాములు, 97000, వేల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు అహమద్ మాట్లాడుతూ... పేదల పెన్నిధి సీఎంఆర్ఎఫ్ అని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేదల వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గరిష్ట పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచి బీద ప్రజలను ఆదుకుంటుందని, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్యమంత్రి సహాయనిధి సాయాన్ని బాధితులకు అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.

లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అహ్మద్ , అనంతరావు దేశాయ్ , బాబు కేతావత్ మాజీఎంపిటిసి , బేగరి రాములు మాజీ సర్పంచ్, నబి, హనుమ గౌడ్, అంబయ్య, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు