17-03-2025 01:40:26 AM
ఎల్బీనగర్, మార్చి 16 : సీఎం రిలీఫ్ ఫండ్ తో ఎంతోమంది పేదలు ఆర్థికంగా ఉపశమనం పొందగలుగుతున్నారని, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సామాన్యులకు వైద్యభారం తగ్గుతుందని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ మంజూరు చేయించారు.
ఈ మేరకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మధుయాష్కీగౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షమేనని, వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ కు చెందిన షాయిన్ భేగం (రూ.60 వేలు), అహ్మదీ బేగం (60వేలు), ధనరకుల లక్ష్మీ బాయి (60వేలు), బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కు చెందిన కొత్త కావ్య (35,500/-) లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ గారు, ఎస్కే మున్నా, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.