calender_icon.png 23 December, 2024 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ

23-12-2024 12:07:40 AM

కరీంనగర్, డిసెంబర్22 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అన్ని పోటీలలో పైచేయి సాధించడం చాలా గొప్ప విషయమని  వారి స్పూర్తి క్రీడా రంగానికి మార్గదర్శకమని  అన్నారు. స్థానిక కరీంన గర్‌లోని డా.బి.ఆర్.అంబేద్కర్ క్రీడా ప్రాంగ ణంలోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు వారి సొంత నిధులతో క్రీడా దుస్తులు పంపిణీ చేసి ఫ్రెండ్లి టోర్నమెంట్ ను ప్రారంభించి శుభాభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు  గుంటపల్లి స్వామి,  రవీందర్ రెడ్డి, యుగంధర్,  తదితరులు పాల్గొన్నారు.