calender_icon.png 17 April, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

14-04-2025 01:46:27 AM

బాన్సువాడ, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని  నసురుల్లాబాద్ మండలానికి చెందిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ బిల్లు చెక్కులను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హాయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పు తెచ్చుకున్న డబ్బులతో ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు డబ్బులు ప్రభుత్వం మంచి రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించి చెక్కులు పంపి నీ చేసినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని  నసురుల్లాబాద్ మండ లానికి చెందిన నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి( CMRF ) చెక్కులను లబ్ధిదారులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద నస్రుల్లాబాద్ మండల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల స్థానిక ప్రజాప్రతిని ధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులుపాల్గొన్నారు.