13-02-2025 11:11:09 PM
మలక్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. గురువారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అంబర్‌పేట తహసీల్ పరిధికి చెందిన 16 లక్ష్మీ, 83 ముబారక్, మొత్తం లబ్ధిదారులకు 99 మందికి రూ. 99,11,484 విలువ చేసే 99 చెక్కులను అందజేశారు. అదే విధంగా చార్మినార్ మండలం పరిధిలో 5 లక్ష్మీ, 70 లబ్ధిదారులు మొత 75 మందికి రూ.75,08,700 విలువ చేసే చెక్కులను అందజేశారు.