calender_icon.png 26 February, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ..

26-02-2025 07:51:23 PM

మణుగూరు (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మణుగూరులోని నీలకంఠేశ్వరాలయం వద్ద భక్తులకు మణుగూరు వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవంల సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మిట్టపల్లి శ్యామ్, బొగ్గవరపు అంజలిలు మాట్లాడుతూ... ప్రతి యేటా మహా శివరాత్రి సందర్భంగా కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరాలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం వాసవీక్లబ్ కు ఆనవాయితీ వస్తోందన్నారు. ఏడాది కూడా క్లబ్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం తలపెట్టిన వాసవీ క్లబ్ ప్రతినిధులను పలువురు ప్రముఖులు అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా మణుగూరు సిఐ సతీష్ కుమార్ పాల్గొనడం సంతోషాదయాకమన్నారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు దోసపాటి నాగేశ్వర రావు, రీజనల్ చైర్మన్ దోసపాటి స్వర్ణ, ఐపీసీ బండారు నర్సింహారావు, జిల్లా జాయింట్ సెక్రటరీ చిట్టూరి శేషుబాబు, వాసవీ క్లబ్ ట్రెజరర్ కంకటాల సాయి, జిల్లా మహిళా అధ్యక్షురాలు చిత్తలూరి ఉమ, కేసా రాజేంద్రప్రసాద్, సంకా శ్రీనివాసరావు, దోసపాటి ధర్మారావు, రాధాశ్యాం గుప్తా, చిత్తలూరి రమేశ్, మురహరి, సుగ్గల సూర్యం, భాను తదితరులు పాల్గొన్నారు.