12-02-2025 06:57:11 PM
లాంఛనంగా ప్రారంభించిన దేవస్థానం ఈవో రమాదేవి...
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దైవ దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దేవస్థానం అధికారులు బుధవారం నుండి మజ్జిగ ప్రసాదం అందజేసే కార్యక్రమం ప్రారంభించారు. దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి ఉదయం శాస్త్రక్తంగా పూజలు నిర్వహించి క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మజ్జిగ ప్రసాదం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే వేసకాలంలో క్యూలైన్ లో ఉన్న భక్తులు ఎండ తాకెటికి నుండి ఉపశయనం పొందేందుకు దేవస్థానం ద్వారా అందజేస్తున్నట్లు తెలియజేశారు. కావున భక్తులు స్వామి వారి మజ్జిగ ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధికారులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు.