02-04-2025 12:00:00 AM
ఇల్లెందు, ఏప్రిల్ 1 (విజయక్రాంతి):సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియాలోని జెకె5, కోయగూడెం ఉపరితల గనుల్లో ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీని కార్యక్ర మాన్ని కాలరీ మేనేజర్ పులి పూర్ణచందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ అజయ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వేసవి కాలా న్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి ఉద్యోగుల దాహార్తిని తీర్చేందుకు నాణ్యమైన మజ్జిగ ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు.
ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల భద్రతకు అత్యధికంగా ప్రాధాన్యతమిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలరీ మేనేజర్ పులి పూర్ణచందర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ చిన్నయ్య, సేఫ్టీ ఆఫీసర్ శివప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సుధాకర్, యు బ్రహ్మం, రవి, శ్రీకాంత్ గుర్తింపు సంఘం తరపున శ్రీనివాస్ రెడ్డి, చిక్క శ్రీనివాస్, సా మల శ్రీనివాస్, ప్రాతినిధ్య సంఘం తరపున భుక్య నాగేశ్వర్ రావు, రాకురి బాబురావు, బండి రాము ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.