02-03-2025 04:40:31 PM
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ వాస్తవులు అయినా కాసగోని శ్రీధర ప్రజా గ్రంథాలయానికి పదివేల రూపాయల పుస్తకాలు పాఠకులకు అందించడం జరిగింది. స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టి ఎంసీఏ వరకు చదివి ప్రస్తుతం హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ టిసిఎస్ లో ప్రాజెక్టు మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రంధాలయాన్ని సందర్శించి ఇక్కడున్న పాఠకులతో వారి యొక్క అనుభూతులను గత అనుభవాలను పంచుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా ఉంటుందని ప్రశంసించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాఠకులందరూ కూడా నిబద్ధతతో అంకితభావంతో చదువుకోవాలని విద్యార్థులకి విన్నవించారు. గ్రంథాలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కాసగోని శ్రీధర్ ని గ్రంథాలయ నిర్వహకులు మెమొంటో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా గ్రంధాలయం ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి లక్ష్మయ్య, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ ఏదులాపురం తిరుపతి పాల్గొన్నారు.