06-04-2025 04:59:24 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం రక్తదాన శిబిరం కరపత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనునట్లు తెలిపారు. ఈ శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణారెడ్డి, బండారి సంజీవులు, గైని శివాజీ, అఖిల్ రావు, మైపాల్, చిరంజీవి, నరేష్, సంతోష్, వినయ్, గపూర్ తదితరులు పాల్గొన్నారు.