ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ యూనిట్లు, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కోఠి ప్రసూతి ఆసుపత్రి లో బాలింతలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి మాజీ పోలీస్ హౌసింగ్‌బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా ముఖ్య అతిథిగా హాజరై 200 మంది బాలింతలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మణ్ గుప్తా మాట్లాడుతూ.. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పదేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్, వైస్ ప్రిన్సిపాల్ తిరుమలరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సత్యనారాయణ, రామకృష్ణ , ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ వసంత్‌కుమార్, బీ శ్యాంసుందర్ పాల్గొన్నారు.