calender_icon.png 1 February, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి ప్రత్యేక తరగతులు విద్యార్థులకు బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ..

01-02-2025 05:55:10 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ చొరవతో ఐటిసి పిఎస్పిడి సారపాక వారి సౌజన్యంతో పదోతరగతి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులకు ఐటిసి బిస్కెట్లను, కమీషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని సూది రెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాది పాఠశాల నుండి 61 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత  శాతాన్ని పెంచటానికి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్ చేస్తున్న కృషిని ఉపాధ్యాయులందరూ ప్రత్యేకంగా అభినందించి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయినితో పాటు ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసరావు, సిహెచ్ అనిల్ కుమార్, ఏ నాగేశ్వరరావు, కెవి వెంకట్రావు, రామారావు, చిలకమర్రి శ్రీనివాసు, రత్నకుమారి, మధుసూదన్ రావు, కేజియా, తిరుపతిరావు, రాంజీ, సాయి కుమారి, విజయబాబు, స్వామి, శేషయ్య, సరోజిని, సునీతతో పాటు మండల రిసోర్స్ పర్సన్ దుర్గారావు, అమ్మ ఆదర్శ పాఠశాల  స్కావెంజర్స్ స్వరూప తులసమ్మతో పాటు మధ్యాహ్నం భోజన కార్మికులు నాగ లక్ష్మి, సుశీల, సరోజిని, అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.