22-04-2025 04:56:29 PM
కాలినడక తప్పించిన మిడ్ వెస్ట్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, గూడూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు మిడ్ వెస్ట్ కంపెనీ(Midwest Group of Companies) సైకిళ్లను సమకూర్చింది. కేసముద్రం మండలం కేసముద్రం స్టేషన్, కల్వల ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 110 మంది విద్యార్థినులకు 6.17 లక్షల రూపాయల వ్యయంతో సైకిళ్లను అందజేసింది. అలాగే కేసముద్రం స్టేషన్, కల్వల, వెంకటగిరితో పాటు నాయకపల్లి ప్రభుత్వ పాఠశాలలకు 3.60 లక్షల వ్యయంతో సమకూర్చిన రెండేసి కంప్యూటర్లను అందజేశారు.
అలాగే 2.25 లక్షల వ్యయంతో సమకూర్చిన 50 బెంచిల్లో వెంకటగిరి పాఠశాలకు 15, నాయక పెళ్లి పాఠశాలకు 35 అందజేశారు. ఈ సందర్భంగా వినయంధర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులు సరైన రవాణా సౌకర్యం లేక ప్రతిరోజూ కాలినడకన పాఠశాలకు వస్తుండడంతో ఆలస్యం జరిగి విద్యాభ్యాసానికి ఆటంకం అలుగుతుండడంతో తమ సంస్థ ముఖ్యంగా విద్యార్థినులకు సైకిళ్లను సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడ్ వెస్ట్ అకౌంట్స్ మేనేజర్ గౌండ్ల మల్లయ్య, మేనేజర్ (హెచ్ ఆర్) రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.