ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్
సిరిసిల్ల, డిసెంబర్ 11 (విజయక్రాం తి): ప్రభుత్వ పాఠశాలలో మత ప్రచారం చేసిన ఉపాధ్యాయుడు లింగాల రాజును సస్పెండ్ చేస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రాజు.. క్రిస్మస్ గిఫ్టుల్లో విద్యార్థులకు బైబిల్ పుస్తకాలతో పాటు కరపత్రాలు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదులు అందడంతో సస్పెన్షన్ వేటు వేశారు.