20-03-2025 05:08:59 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం చందాయి పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామీణ సాక్షరత్ మిషన్, భారత్ సర్కార్ వారి సహాయంతో పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ... మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వపరంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల బట్టలు, నాణ్యమైన విద్య, తదితర సదుపాయాలను పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవీందర్, సీనియర్ ఉపాధ్యాయురాలు ఊర్మిళ, నరేష్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ శిలా వీరమణి తదితరులు పాల్గొన్నారు.