18-02-2025 12:00:00 AM
-కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : జిల్లాలోని దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, అలింకో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సహాయ ఉపకరణములను ఉచితంగా పంపిణీ చేసేందుకు అరులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, అలింకో సంస్థ ప్రస్తేటిస్ట్ ఆర్థోటిస్ట్ వైద్యులు డాక్టర్ సునీత సుభాదర్శిని దాస్ లతో కలిసి నాలుగు రకాల వైకల్యాలు కలిగిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేసేందుకు అరుల ఎంపిక కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. దివ్యాంగత్వ శాతం, అరత ఆధారంగా దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడం జరుగుతుందన్నారు. శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, మూడు చక్రాల రిక్షా, వీల్ చైర్, చంక కర్రలు, చేతి కర్రలు, బదిరులకు (మూగ, చెవిటి) శ్రవణ యంత్రాలు, అంధులకు ప్రత్యేక మొబైల్ ఫోన్లు, చేతి కర్రలు, మానసిక దివ్యాంగులకు ప్రత్యేక కిట్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్. మంచిర్యాల ప్రాజెక్టు సి.డి.పి.ఓ. విజయలక్ష్మి, సూపర్వుజర్స్, అలింకో సంస్థ ప్రతినిధులు, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి ఎండి. ఫర్ణానా బేగం, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్, సఖి సిబ్బంది, డి.హె.ఈ.డబ్ల్యు., చైల్డ్ లైన్ సిబ్బంది, సంబంధిత అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.