29-03-2025 10:34:39 PM
పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..
భద్రాచలం (విజయక్రాంతి): అవయవాలు కోల్పోయిన 60 మంది వికలాంగులకు రోటరీ భద్రాచలం, రోటరీ క్లబ్ ఖమ్మం, ఏకం యూఎస్ఏ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు 60 మంది వికలాంగులకు కృత్రిమ అవయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు పాల్గొని 6 లక్షల విలువచేసే కృత్రిమ అవయవాలను 60 మందికి, 2 లక్షల 30 వేల రూపాయలు విలువ చేసే మూడు చక్రాల సైకిల్స్ ను 20 మందికి అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రోటరీ క్లబ్లు సంయుక్తంగా అందజేసిన ఈ అవయవాలు మూడు చక్రాల సైకిళ్లు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా రోటరీ క్లబ్ కు పూర్తి సాయ సహకారం అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు దారా బాలాజీ రావు కార్యదర్శి విద్యాసాగర్ కోశాధికారి శ్రీనివాస్ ఏ శ్రీనివాసరెడ్డి, యశోద రాంబాబు, మహాలక్ష్మి, జి నాగేశ్వరరావు, ముని కేశవ్, రఫీ, వీరభద్రం, కొదుమూరి రామకృష్ణ, మోహనకృష్ణ, ఏ సాయిరాం, పి ఎల్ ఎన్ కేశకుమారి, చలపతి, తదితరులు పాల్గొన్నారు.