calender_icon.png 19 April, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ దీక్ష పరులకు అన్నప్రసాద వితరణ

11-04-2025 01:19:31 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 10: కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి వార్డులో గల మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో కొత్త జయపాల్ రెడ్డి సహకారం తో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తారీకు చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం నుంచి జయంతి వరకు  హనుమాన్ దీక్ష మాలదారులకు అన్న ప్రసాదన వితరణ (బిక్ష) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి కొత్త జయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరై హనుమాన్ చిత్రపటానికి  ప్రత్యేక పూజలు చేసి, స్వాములకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ దీక్ష మాలదారులకు  అన్న ప్రసాద వితరణ చేయడం తన అదృష్టమని, నేటి నుండి చిన్న హనుమాన్ జయంతి వరకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ డి సంపత్ మాట్లాడుతూ హనుమాన్ మాల దీక్షపరులకు అన్నదానం చేసేందుకు సంకల్పించి మొదటగా కొత్త జయపాల్ రెడ్డిని సంప్రదించగా వారు వెంటనే అంగీకరించి వారి సహకారం అందించారని వారితోపాటు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, అన్నమనేని రాంప్రసాదరావు, ఆది వివేక్, చల్ల హరి శంకర్, అయ్యప్ప మహా పాదయాత్ర  గురు స్వామి గడప నాగరాజు, బిఆర్‌ఎస్ నాయకులు ఎం.ఏ కరీం ల సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం, నల్ల ఆదిరెడ్డి, శ్రీను,విజయ్,శివ, ఎడవెల్లి కుమార్, జయపాలన్న మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.