13-02-2025 08:52:15 PM
మునగాల: కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలోని నూతనంగా నిర్మించబడిన షిర్డీ సాయిబాబా మందిరంలో కుందూరు సీతారాములు సునీత దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దేవినేని రవి కుమార్ మాట్లాడుతూ... ఈ దేవాలయంలో 2వ గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించినారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ చలపతి, తడకమల శ్రీనివాస చారి, కుందూరు వీరభద్రం వెంకటనారాయణ, నాగేశ్వర్రావు, రాజేష్, వెంకట నారాయణ, కోదాటి శ్రీను, భక్తులు తదితరులు పాల్గొన్నారు.