07-02-2025 12:23:40 AM
పిట్లం ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): పిట్లం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నాడు‘అడల్ట్ బీసీజీ‘ వ్యాక్సినేషన్, ‘ఎన్ డి డి‘ ప్రోగ్రామ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో, నేషనల్ డివామింగ్ ప్రోగ్రామ్ (ఎన్ డి డి) అనుసరించి, 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండలైజేడ్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు.
దీని ద్వారా కడుపులోని నూలు పురుగులు చనిపోవడం సులభమవుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్ తెలిపారు.అదేవిధంగా, పెద్దలకు క్షయ వ్యాధిని నివారించేందుకు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అవశ్యకతను కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రోహిత్ కుమార్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ భూమయ్య, పబ్లిక్ హెల్త్ నర్స్ అన్వర్రీ బేగం, సూపర్వైజర్స్ యశోద శాంతి శ్రీ, ఐసిడిఎస్ సూపర్వైజర్ షహనాజ్ బేగం, హెల్త్ అసిస్టెంట్స్ విజయ్ కుమార్,శ్యామ్ రావు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.