కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల సొమ్ముతో దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్‌దని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల చెవిలో పువ్వుపెట్టకు కేటీఆర్ అంటూ గురువారం ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. “నీవు మహా డ్రామా రావు అని ప్రజలకు తెలుసు.. నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది.. తెలంగాణలో మేమే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంత లాగా మీ నాయన, నీవు వ్యవహరించారు..
నీవు ఒక యువరాజువు.. నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసు”అంటూ చామల ఆరోపించారు. ఏస్ నెక్స్ట్ జెనరేషన్స్ గ్రీన్‌కో సంస్థ యాజమాన్యం కేటీఆర్‌కు అత్యంత మిత్రులని ఆరోపించారు. వారిని కాపాడటానికి సీజన్ 1కి వాగ్దానం చేసిన రూ.90 కోట్లు చెల్లించని కారణంగా రూ.30 కోట్లు ఇచ్చి, 60 కోట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్లు నోటీసులు జారీ చేసి, కాంట్రాక్టు రద్దు చేస్తామని చెప్తే, కేటీఆర్ తన మిత్రులు గ్రీన్ కో ప్రమోటర్స్‌ను చేశారని వివరించారు.