calender_icon.png 5 January, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర వేడుకలకు దూరం

01-01-2025 01:40:21 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడు కలకు దూరంగా ఉంటున్నానని, తెలంగాణ బిడ్డలుగా ఇది మన బాధ్యత అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ‘న్యూ ఇయర్ వేళ.. నూతన సంవత్సర వేడుకలు రద్దు’ అని మంగళవారం స్పీకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ స్మారకార్దం వారం రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నందున నూతన సంవత్సర వేడుక లకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన మన్మోహన్ సింగ్‌కు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలదని, శుక్రవారం వరకు సంతాప దినాలు ఉన్నాయని చెప్పారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి తన నివాసానికి రావద్దని, తాను కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు.