calender_icon.png 28 December, 2024 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్మనీ పార్లమెంట్ రద్దు

28-12-2024 01:27:08 AM

ఫిబ్రవరి 23న ఎలక్షన్స్

బెర్లిన్, డిసెంబర్ 27: జర్మనీ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ ప్రకటించారు. ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ఛాన్సలర్ ఒలాఫ్ తాత్కాలిక ప్రభుత్వ పాలన బాధ్యతలు స్వీకరించారు. 733 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో ఇటీవల ఓటింగ్ జరగ్గా, ఛాన్సలర్ ఓలాఫ్ విశ్వాసం కోల్పోయారు. ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లు మాత్రమే  వచ్చాయి. వ్యతిరేకంగా 394 దాఖలయ్యాయి. 116 మంది గైర్హాజరయ్యారు.కానీ, మెజార్టీకి 367 ఓట్లు అవసరం. అది సాధ్యకం కాకపోవడంతో  తిరిగి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి.