calender_icon.png 2 November, 2024 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడిశా పీసీసీ రద్దు

22-07-2024 02:35:26 AM

భువనేశ్వర్, జూలై 21: ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణ యం తీసుకుంది. ఒడిశాలోని పీసీసీని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రద్దు చేశారు. ఒడిశా అధ్యక్షుడితో సహా మొత్తం పీసీసీని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు ఖర్గే ఆదివారం ఆమోదం తెలిపారు. తిరిగి పీసీసీని ఎంపిక చేసేవరకు డీసీసీ అధ్యక్షులనే పీసీసీ ప్రెసిడెంట్లుగా నియమిస్తున్న ట్లు తెలిపారు. ఒడిశా పీసీసీ చీఫ్‌గా ఇప్పటివరకు శరత్ పట్నాయక్ పనిచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా లోని మొత్తం 21 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలోనే విజయం సాధించింది. బీజేపీ 20 స్థానాల్లో గెలుపొందగా బీజేడీ ఖాతా తెరవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 147 సీట్లకు బీజేపీ 78, బీజేపీ 51, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించాయి.