calender_icon.png 20 January, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేషన్ చైర్మన్లపై అసంతృప్తి!

20-01-2025 12:38:59 AM

  1. పార్టీ ప్రోగ్రామ్స్‌కు దూరంగా ఉండటంపై గుర్రు
  2. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని ఆగ్రహం 
  3. వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు క్లాస్ తీసుకున్న పార్టీనేతలు 
  4. శాఖలపై పట్టుపెంచుకోవాలని దిశానిర్ధేశం

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత వివిధ కార్పొరేషన్ చైర్మన్లను సచివాలయానికి పిలుపించుకొని.. వారి పనితీరుపై తీవ్ర అసంతృపి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీపై దూకుడుతో వ్యవహరించి.. అధికారంలోకి వచ్చి పదవులు పొందాక ఎందుకు స్పీడ్ తగ్గింది? ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గా ఎందుకు స్పందించడం లేదు? నామినేటెడ్ పదవులు వచ్చాక.. పార్టీ కార్యక్రమాలకు దూరమవడానికి కారణాలేంటి? అని ప్రశ్నలు సంధించనట్లు సమాచారం.

పరిస్థితుల్లో మార్పు తెచ్చుకోవాలని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది. ంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు చేసిన అవినీతి, అక్రమాలను బయటపెట్టి ప్రజలకు వివరించాలని సదరు ముఖ్యనేత సూచించినట్టు తెలిసింది.

ఇష్టారీతిన ఖర్చులు చేయడం, కోట్ల రూపాయలు డ్రా చేయడం, వ్యక్తిగత సిబ్బందికి కార్పొరేషన్ ద్వారా కేటాయింపులు ఇతర అంశాలను గుర్తించి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్టు సమాచారం.  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలుపుకొని దాదాపు 36 మందికి ఒకేసారి కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చింది. ఆ తర్వాత మరో ఐదుగురికి సైతం నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. అయితే పదవులు రాకముందు నిత్యం గాంధీభవన్, పార్టీ నాయకుల చుట్టూ తిరిగి.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

కమిషన్ల చైర్మన్లు రాజకీయంగా స్పందించడానికి అవకాశం ఉండదని, ప్రభుత్వ పథకాలను వివిధ సందర్భాల్లో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మెజార్టీ కార్పొరేషన్ చైర్మన్లు తమ శాఖలపై పట్టు పెంచుకోకపోవడమే కాకుండా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇదే అంశాన్ని నిఘావర్గాలు సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కొందరు కార్పొరేషన్ చైర్మన్లు సొంత పనులకే పరిమితమవుతున్నారని, కనీసం తమ శాఖలపై సమీక్షలు కూడా చేయడం లేదని, అలాంటి రికి మళ్లీ రెన్యువల్ చేయొద్దన్న అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.