హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): ఈ నెల 11న ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వర తాగునీటి సరఫరాలో అంతరా కలుగుంతుందని బుధవారం జలమండలి అధికారులు తెలిపారు.
జలమండలి పరిధిలోని హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ ఫోర్‌బే, మిరాలం ఫిల్టర్ బెడ్స్ సెట్లింగ్ ట్యాంకులు, ఇన్‌లెట్ ఛానళ్లను శుభ్రం చేయనున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడుతుందని ఒక ప్రకటనలో చెప్పారు. దీంతో హసన్‌నగర్, కిషన్‌బాగ్, దూద్‌బౌలి, మిస్రిగంజ్, పత్తర్‌గట్టి, దారుల్‌షి మొఘల్‌పురా, జహానుమా, చందూలాల్ బరాదరి, ఫలక్‌ను జంగంమెట్ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు